రవిప్రకాశ్‌ భార్యకు నోటీసులు

Notices To TDP Ravi Prakash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌కు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్‌ పరారీలో ఉండటంతో  ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులిచ్చారు. రేపు తమ ఎదుట హాజరుకావాలని రవిప్రకాశ్‌ను పోలీసులు ఆదేశించారు. నటుడు శివాజీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా టీవీ9 కార్యాలయం నుంచి 12 హార్డ్‌డిస్క్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నారు. టీవీ9 కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. క్లూస్‌ టీమ్‌ కూడా సోదాల్లో పాల్గొన్నాయి.  

షేర్ల బదలాయింపుపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రవిప్రకాశ్ ఆర్థిక లావాదేవీలతో పాటు ఫోర్జరీలపై ఆరా తీస్తున్నారు. శివాజీకి రవిప్రకాశ్ ఇచ్చినట్టుగా చెబుతున్న షేరు ఎవరివి? ఉద్యోగుల షేర్లను శివాజీకి బదలాయించారా? తదితర అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. టీవీ9 చానల్‌ను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు రవిప్రకాశ్‌ చేసిన కుట్రను కొత్త యాజమాన్యం రట్టు చేయడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. ఏబీసీఎల్‌ కార్పొరేషన్‌ నుంచి 90శాతం షేర్లు కొనుగోలు చేసి టీవీ9ను అలంద మీడియా టేకోవర్‌ చేసింది. యాజమాన‍్యం మారిన తర్వాత కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకోవాలన్న ప్రతిపాదనకు రవిప్రకాశ్‌ మోకాలొడ్డారు. అంతేకాదు ఏకంగా ఫోర్జరీ సంతకంతో నకిలీ డాక్యుమెంట్‌ను సృష్టించి కుయుక్తులు పన్నారని రవిప్రకాశ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు
టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదు

రవిప్రకాశ్‌ పాస్‌పోర్ట్‌ స్వాధీనం, శివాజీ ఇంట్లో సోదాలు

టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్‌ తొలగింపు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top