
సాక్షి న్యూఢిల్లీ/గ్రేటర్ నోయిడా: చదువుకోవాలని మందలించినందుకు కన్న తల్లితో పాటు చెల్లిని ఓ బాలుడు క్రికెట్ బ్యాట్, పిజ్జా కట్టర్‌లతో పాటు కత్తెరలతో దారుణంగా హతమార్చాడు. గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీలో సోమవారం ఈ దారుణం జరిగింది. పోలీసులిచ్చిన వివరాల ప్రకారం.. ‘హైస్కూల్ గ్యాంగ్‌స్టర్ ఎస్కేప్’ అనే ఆన్‌లైన్ ఆటకు బానిసైన 15ఏళ్ల టీనేజర్ ఎక్కువసేపు మొబైల్‌తో గడిపేవాడు. దీంతో అతని తల్లి అంజలి(42) మందలించేది. సోమవారం రాత్రి మొబైల్ పక్కనబెట్టి చదువుకోమని తల్లి తిట్టింది.
దీంతో అందరూ నిద్రపోయాక రాత్రి 11 గంటల సమయంలో తల్లి అంజలి, చెల్లి మణికర్ణిక(12)లను క్రికెట్ బ్యాట్‌తో కొట్టిచంపాడు. వారిద్దరి తలపై బ్యాట్‌తో బలంగా మోది ఆ తర్వాత పిజ్జా కట్టర్, కత్తెరలతో వారి ముఖాలను చెక్కేశాడు. తర్వాత ఇంట్లోని రూ.2 లక్షల నగదు, తల్లి మొబైల్‌తో పరారయ్యాడు. రైలులో చండీగఢ్, సిమ్లా చివరికి వారణాసికి వెళ్లాడు. తండ్రి అగర్వాల్ ఫోన్‌చేసినప్పటికీ ఎవ్వరూ స్పందించకపోవడంతో ఇంటికెళ్లి చూసిరావాలని బంధువులకు చెప్పాడు. ఇంటికొచ్చి చూసిన బంధువులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు శుక్రవారం బాలుడిని వారణాసిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సదరు బాలుడు తన నేరాన్ని అంగీకరించాడు.