కొలిక్కిరాని క్యాషియర్‌ వ్యవహారం

No Clarity On State bank Robbery Money jewellery  - Sakshi

బ్యాంక్‌ వద్ద ఖాతాదారుల ఆందోళన

కొనసాగుతున్న రికార్డుల పరిశీలన

పోరుమామిళ్ల :పోరుమామిళ్ల స్టేట్‌బ్యాంక్‌లో బుధవారం కోటిరూపాయలకు పైగా డబ్బు, నగలు తీసుకుని పరారయిన మార్తాల గురుమోహన్‌రెడ్డి కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గురువారం బ్యాంక్‌ మేనేజర్‌ కృష్ణారెడ్డి చెప్పిన రూ. 91.49 లక్షల నగదు, 24 మంది ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారు మాత్రమేనా? ఇంకా అధికంగా పోయిందా? అన్న విషయం స్పష్టం కాలేదు.
శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా బ్యాంకుకు సెలవు అయినా సిబ్బంది రికారŠుడ్స, లాకర్లు, ఇతర అంశాల పరిశీలన చేస్తున్నారు. రీజినల్‌ మేనేజర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కడప నుంచి వచ్చిన సిబ్బంది బ్యాంకులో తనిఖీలు చేపట్టారు.

ఖాతాదారుల ఆందోళన
బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. బ్యాంకులో తాము పెట్టిన డబ్బుకు, బంగారుకు భద్రత లేకపోవడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయనాయకులు రుణాల రూపంలో కోట్లు తీసుకుని ఎగవేత ద్వారా బ్యాంకులను ముంచుతుండగా, ఇప్పుడు ఏకంగా  బ్యాంకు సిబ్బందే దోచుకోవడం అందరినీ కలవరపెడుతోందని ఖాతాదారులు వాపోయారు. ఇద్దరు మైనారిటీ మహిళలు తమ బంగారు ఉందా? లేదా? అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. పోయిన డబ్బు బ్యాంకు అధికారులు ఖాతాదారులకు చెల్లించినా, తమ ఆభరణాల విషయంలో ఏమి చేస్తారన్న ప్రశ్న వచ్చింది. ఒకరిద్దరు ఖాతాదారులు తమకు ఇచ్చిన రశీదులో బ్యాంక్‌ సీల్‌ ఉందని, క్యాషియర్‌ సంతకం చేయలేదని తెలిపారు. మోసం చేసే ఉద్దేశ్యంతోనే గురుమోహన్‌రెడ్డి సంతకం చేయలేదని భావిస్తున్నామన్నారు.

ఎవ్వరికీ నష్టం జరగదు,భయం వద్దు: ఆర్‌ఎం
బ్యాంకులో క్యాషియర్‌ చేసిన నిర్వాహకంపై విచారణ జరుగుతోందని, అతను ఎక్కడికీ తప్పించుకుపోలేడని ఆర్‌ఎం శ్రీనివాసులు చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టం బ్యాంకుకేగానీ, ఖాతాదారులకు జరగదన్నారు. అందరి డబ్బుకు, బంగారుకు బ్యాంకు జవాబుదారీగా ఉంటుందన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top