విశాఖ చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్ | New twist in Visakhapatnam robbery case | Sakshi
Sakshi News home page

విశాఖ చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్

Aug 8 2019 12:28 PM | Updated on Aug 8 2019 1:12 PM

New twist in Visakhapatnam robbery case - Sakshi

సాక్షి, విశాఖ : నగరంలోని పోర్టు రోడ్డులో బుధవారం జరిగిన చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. పనిచేసే సంస్థకే దోపిడీ పేరుతో పంగనామాలు పెడదామనుకున్న ఓ ప్రబుద్ధుడి గుట్టును పోలీసులు 24 గంటల్లోనే రట్టు చేశారు. తనపై దుండగులు దాడి చేసి రూ.20 లక్షలు దోచుకు వెళ్లారంటూ నగర పోలీసులను పరుగులు పెట్టించిన బాధితుడు శ్రీనివాసరావే నిందితుడు అని తేలింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులకు... బాధితుడు పొంతనలేని సమాధానం చెప్పడంతో  దీనిపై లోతుగా ఆరా తీశారు. ట్రాన్స్‌పోర్టు కంపెనీ సొమ్ము రూ.20 లక్షలు కాజేసేందుకు అతడు చోరీ నాటకం ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో శ్రీనివాసరావు దొంగతనం నాటకం బట్టబయలు అయింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు వంటిపై గాయాలు చేసుకుని, కట్టుకథ అల్లినట్లు నిర్థారణకు వచ్చారు. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాసరావు పోలీసుల అదుపులో ఉన్నాడు.

చదవండివిశాఖలో పట్టపగలే భారీ దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement