విశాఖలో పట్టపగలే భారీ దోపిడీ

Transport Supervisor robbed of 20 lakhs in visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖ : నగరంలోని పోర్టు రోడ్డులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. బైక్‌పై వెళుతున్న సిటీ ట్రాన్స్‌పోర్టు కంపెనీ సూపర్‌వైజర్‌ శ్రీనివాసరావుపై దుండగులు కత్తితో దాడి చేశారు. అతని వద్ద రూ.20 లక్షల నగదు లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మల్కాపురం, హార్బర్‌ పోలీసులు రంగంలోకి దిగి బాధితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. గాజువాకకు చెందిన శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై బుధవారం మధ్యాహ్నం పోర్టు పరిధిలోని ఐఎన్‌ఎస్‌ డేగా వైపుగా వెళుతున్నాడు. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని మధ్యలో ఆపి దాడి చేశారు. ఆ తర్వాత శ్రీనివాసరావు వద్ద ఉన్న రూ.20 లక్షలు పట్టుకుని వెళ్లిపోయారు. వెంటనే బాధితుడు హార్బర్‌ పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దోపిడీ తెలిసినవాళ్ల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top