కలకలం రేపుతున్న యువకుడి కిడ్నాప్

Mystery Of Young man Kidnap Case In Bhimavaram - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో యువకుడి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. భీమవరంలో లోక్‌ష్‌ అనే యువకుడు వారం రోజుల క్రితం కిడ్నాప్‌ అయ్యాడు. అనంతరం యువకుడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసిన కిడ్నాపర్లు రెండు లక్షలు ఇవ్వాలంటూ వారిని బెదించారు. లోక్‌ష్‌ను విశాఖ జిల్లా భీమిలి తీసుకెళ్లి కొట్టిన కిడ్నాపర్లు.. తీవ్ర గాయాలైన యువకుడిని రెండు రోజుల క్రితం భీమవరంలో వదిలేసి వెళ్లారు. ప్రస్తుతం చికిత్స నిమిత్తం లోక్‌ష్‌ను ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారమే కిడ్నాప్‌కు కారణం అయ్యి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా టీడీపీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతమహాలక్ష్మీ గన్‌మెన్‌ పడమట పాండు, అతని స్నేహితులతో కలిసి కిడ్నాప్‌ చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top