ప్రేమజంటకు హత్యా బెదిరింపులు | Murder Threats To Love Couple In Tamil Nadu | Sakshi
Sakshi News home page

ప్రేమజంటకు హత్యా బెదిరింపులు

Jun 1 2018 8:59 AM | Updated on Jul 30 2018 9:16 PM

Murder Threats To Love Couple In Tamil Nadu - Sakshi

వినతి ఇచ్చేందుకు వచ్చిన రంజిత, కదిరేశన్‌

అన్నానగర్‌: కులాంతర వివాహం చేసుకున్న తమకు హత్యా బెదిరింపులు ఎదురవుతున్నాయని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం తిరుప్పూర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో మహిళ భర్తతో కలిసి వినతి పత్రం ఇచ్చింది. తిరుప్పూర్‌ జిల్లా కాంగేయం ముళ్లిపురం కాలనీకి చెందిన రంజిత (22). ఈమె భర్త కదిరేశన్‌ (25), కుమార్తె నిశాంతి(2) తో పాటు బుధవారం తిరుప్పూర్‌ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయానికి వచ్చి అక్కడున్న అధికారులకు వినతి పత్రం ఇచ్చింది.

అందులో.. 2015లో తాను, కదిరేశన్‌ ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నామని ప్రస్తుతం రెండేళ్ల కుమార్తె ఉన్నట్టు తెలిపారు. తమ ప్రాంతానికి చెందిన జానకి, విజయ్, చెన్నయప్పన్‌లు గత 25వ తేదీ ఇంట్లోకి చొరబడి వెంటనే ఇక్కడినుంచి ఖాళీ చేయాలని బెదిరించి, తన భర్తపై దాడి చేసి హత్య బెదిరింపులు చేశారని వివరించారు.  దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హామీఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement