బయటపడిన రైల్వే ఉద్యోగాల మోసం | Mumbai Gang Arrested In Railway Jobs Fraud In Vijayawada | Sakshi
Sakshi News home page

బయటపడిన రైల్వే ఉద్యోగాల మోసం

Jan 30 2019 10:35 AM | Updated on Jan 30 2019 10:50 AM

Mumbai Gang Arrested In Railway Jobs Fraud In Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ : రైల్వే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను బోల్తా కొట్టించిన ఓ ముఠా బాగోతం బుధవారం బయటపడింది. ముంబైకి చెందిన మిత్రా, నాగూర్‌, వరుణ్‌ యశ్వంత్‌ సోలంకి విజయవాడ కేంద్రంగా ఈ మోసానికి తెరలేపారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.8 లక్షలకు అమ్ముతామంటూ బేరం పెట్టిన కేటుగాళ్లు.. నగరంలోని ఓ ​ప్రముఖ హోటల్‌లో ఫేక్‌ ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. ఈ తతంగంపై అనుమానం వచ్చిన చిరంజీవి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇంటర్వ్యూల సందర్భంగా నిరుద్యోగుల నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసేందుకు ముఠా సభ్యులు యత్నించినట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement