వివాహేతర సంబంధం: మాతృత్వానికే మచ్చ తెచ్చింది! | mother brutally tortured child | Sakshi
Sakshi News home page

Dec 3 2017 11:06 AM | Updated on Dec 3 2017 11:26 AM

 mother brutally tortured child - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఎస్సార్‌ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

చిన్నారి రోదన విని.. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి చైల్డ్‌లైన్‌ సంస్థకు అప్పగించారు. చిన్నారిని కాలుతున్న పెనంపై కూర్చోబెట్టిన తల్లి లలితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొన్నిరోజులుగా లలిత వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ సంబంధం కారణంగానే చిన్నారిని వదిలించుకునేందుకు ఆమె ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement