తల్లీబిడ్డ అదృశ్యం | Mother And Child Mising in YSR kadapa | Sakshi
Sakshi News home page

తల్లీబిడ్డ అదృశ్యం

Feb 6 2019 1:49 PM | Updated on Feb 6 2019 1:49 PM

Mother And Child Mising in YSR kadapa - Sakshi

అదృశ్యమైన తల్లీబిడ్డ (ఫైల్

వైఎస్‌ఆర్‌ జిల్లా, రామాపురం : మండలంలోని సుద్దమళ్ల పంచాయతీ ఓబుల్‌రెడ్డిగారిపల్లెకు చెందిన కర్ణపు సౌజన్య (30), ఆమె కూతురు భావన కనిపించడం లేదని సౌజన్య తండ్రి రామిరెడ్డి మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సౌజన్య భర్త వెంకటసుబ్బారెడ్డి చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. వారానికి ఒక రోజు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. వీరికి ఇద్దరు దీక్షితారెడ్డి, భావన అనే ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు దీక్షితారెడ్డి  స్ధానిక ఆర్‌సీఎం చర్చిలో చదువుతోంది. అయితే రెండు రోజులుగా సౌజన్య, భావన కనిపించడం లేదు. వీరికోసం బంధువుల ఇళ్లల్లో కూడా వెతికినా ఫలితం లేదని సౌజన్య తండ్రి రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement