మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడి..

Molestation on Three Year Old Girl Child in Patancheru - Sakshi

రక్తస్రావం కావడంతో ఘటన వెలుగులోకి

అమీన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌లో పరిధిలో ఘటన

నిందితుడికి రిమాండ్‌  

పటాన్‌చెరు టౌన్‌: కామంతో కళ్లుమూసుకుని మూడేళ్ల చిన్నారిపై ఓ మృగాడు కాటువేసాడు.. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన అమీన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిందితుడిని రిమాండ్‌కు తరలించే ముందు డీఎస్పీ రాజేశ్వర్‌రావు విలేకరుల సమావేశం నిర్వహించి ఘటనా వివరాలను వెల్లడించారు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అభయ్‌కుమార్‌ బతుకుదేరువు కోసం సంగారెడ్డి జిల్లా.. అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామం గండిగూడ కాలనీలో నివాసం ఉంటూ స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అదే కాలనీలో అమ్మమ్మ, తల్లితో పాటు బాధిత మూడేళ్ల చిన్నారి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం పాప తల్లి అనారోగ్యంతో బాధపడుతుండంతో అమ్మమ్మ నీటికోసం వెళ్తూ పాపను చూసుకోమని పక్కింటికి చెందిన అభయ్‌కుమార్‌ దగ్గర ఉంచి వెళ్లింది. తిరిగి వచ్చేలోపే అభయ్‌కుమార్‌ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన తల్లి, అమ్మమ్మ నిందితుడు అభయ్‌కుమార్‌ను నిలదీయగా ఇద్దరిని తోసివేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అభయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top