రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం

Medical Student Dies In Bike Accident Adilabad - Sakshi

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

నల్గొండ జిల్లా ఏపీలింగోటం వద్ద ప్రమాదం

మృతురాలు ఇచ్చోడ వాసి

నార్కట్‌పల్లి(నకిరేకల్‌): రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్ర ంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం శివారులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడకు చెందిన స్రవంతి(25), హైదరాబాద్‌కు చెందిన రమ్య, నాగజ్యోతి ఇక్కడి కామినేని వైద్యకళాశాలలో హౌస్‌ సర్జన్‌ విద్య అభ్యసిస్తూ హాస్టల్‌లో ఉంటున్నారు. ఆదివారం కావడంతో ఉదయం టిఫిన్‌ చేసేందుకు ముగ్గురు కలిసి హాస్టల్‌ నుంచి స్కూ టీపై సమీపంలోనే ఉన్న ఏపీ లింగోటం గ్రామాని కి వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో టిఫిన్‌ చేసిన తర్వాత స్కూటీపై సూర్యాపేట వైపు బయలుదేరారు.

మరో కిలోమీటర్‌ దూరంలో యూటర్న్‌ తీసుకుని హాస్టల్‌కు వచ్చేందుకు ప్రయాణిస్తున్నా రు. హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న గుర్తుతెలి యని వాహనం వీరి స్కూటీని వెనుకనుంచి  ఢీకొట్టింది. దీంతో స్రవంతి డివైడర్‌పై పడింది. స్రవంతి తలకు బలమైన గాయం తగిలింది. స్థానికులు గమనించి వెంటనే 108లో కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి స్రవంతి మృతిచెందింది. నాగజ్యోతి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబా ద్‌కు తరలించారు. రమ్య ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది.

ఇచ్చోడలో విషాదచాయలు..
ఇచ్చోడ(బోథ్‌): ఇచ్చోడ టీచర్స్‌ కాలనీకి చెందిన సామన్‌పల్లి సుదర్శన్‌ రెండో కుమార్తె స్రవంతి ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. స్రవం తి చిన్నప్పటి నుంచే చదువులలో చురుకుగా ఉం డేది. కూతురును డాక్టర్‌ చేయాలని సుదర్శన్‌ కష్టపడి చదివించాడు. రెండు నెలలో చదువు పూర్తి చేసుకునే లోపే మృతిచెందడం అందరినీ కలచివేసింది. స్రవంతి మృతితో టీచర్స్‌కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top