మహిళపై సామూహిక లైంగిక దాడికి యత్నం! | Mass sexual assault on married woman | Sakshi
Sakshi News home page

మహిళపై సామూహిక లైంగిక దాడికి యత్నం!

Oct 23 2017 12:53 PM | Updated on Oct 23 2017 12:53 PM

Mass sexual assault on married woman

బాధితురాలిపై లైంగిక దాడికి యత్నించింది ఇక్కడే..

పశ్చిమగోదావరి, నల్లజర్ల: నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో కొబ్బరితోటలో కూలీపని చేస్తున్న మహిళపై గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి యత్నిం చారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని వెజ్జు సుబ్బారావుకు చెందిన కొబ్బరితోటలో ఓ జంట మకాం ఉంటూ కూలిపనులు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మద్యం తాగి గేటు దూకి తోటలోకి వచ్చారు. ఈ సమయంలో తన భర్త లేడని, ఇదే అదనుగా ముగ్గురు యువకులు తనను తాడుతో బంధించి అత్యాచారం చేయబోయారని, కే కలు వేయడంతో తన భర్త వచ్చి అడ్డుపడగా అతడినీ గాయపర్చారని బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌ వద్ద విలేకరులకు తెలిపింది. సమీపంలోని జనం వచ్చి యువకులను పట్టుకున్నారని చెప్పింది.

పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె చె బుతుండగా కొందరు వచ్చి ఆమెను మాట్లాడకుండా కట్టడి చేశారు. దీనిపై అనంతపల్లి ఎస్సై వి.చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేశామని సామూహిక అత్యాచారం అన్నది వాస్తవం కాదన్నారు. మ ద్యం తాగిన యువకులు గలాటా చేసినట్టు గుర్తించామన్నా రు. వారిని అదుపులోకి తీసుకుని న్యూసెన్స్‌ కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో కూడా కేసు నమోదుకాలేదు. యువకులను తోట యజమానులు గట్టిగా కొట్టడం, వారు తిరిగి తమపై కేసుపెడతారన్న కారణంగానే ఏమీ జరగనట్టు చెప్పాలని బాధిత మహిళపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. యువకులను కొట్టిన విషయంలో రౌడీషీటర్‌ కూడా ఉన్నట్టు తెలిసింది. ఎందుకు కేసును తప్పుదారి పట్టిస్తున్నారో తెలియడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement