ఉరేసుకుని మహిళ ఆత్మహత్య | married Woman Commits Suicide prakasam | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

Nov 16 2018 1:19 PM | Updated on Nov 16 2018 1:19 PM

married Woman Commits Suicide prakasam - Sakshi

ప్రమీల మృతదేహం సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ

ప్రకాశం ,చీమకుర్తి: సంతనూతలపాడు చాకలిపాలెంలో నీలం ప్రమీల (35) అనే మహిళ ఇంట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం వేకువ జామున 3 గంటల సమయంలో జరిగింది. మృతురాలి తండ్రి పి.తిరుపతిస్వామి కథనం ప్రకారం.. మృతురాలికి తరుచూ తలనొప్పి వస్తుండేది. నొప్పి భరించలేక అప్పుడప్పుడూ తాను ఆత్మహత్య చసుకుంటానని కుటుంబ సభ్యులతో చెప్తుండేది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని సంతనూతలపాడు ఎస్‌ఐ షేక్‌ ఖాదర్‌బాషా పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమీల ఉరేసుకున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement