వివాహితది హత్యా.. ఆత్మహత్యా..?

అనంతపురం సెంట్రల్: నగరంలోని ఆరోరోడ్డులో బుధవారం జరిగిన సౌమ్య (25) అనే వివాహిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుండగా.. మెట్టినింటి వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడిందని అత్తింటి వారు చెబుతున్నారు. పంటకు వాడే పురుగుమందు ఇంట్లోకి ఎలా వచ్చింది..? దానిని ఎవరు తీసుకొచ్చారు..? అనేది తెలియడం లేదు.
అదనపు కట్నం తీసుకురాలేదన్న అక్కసుతో అత్తమామలే అంతమొందించి ఉంటారని సౌమ్య బంధువులు ఆరోపిస్తున్నారు. సౌమ్య మృతి చెందిన రోజు నుంచి ఈరోజు వరకు అత్తింటి వారిని అదుపులోకి తీసుకోలేదని, విచారణా చేపట్టలేదన్నారు. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే ఉదాసీనంగా వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి