మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య | Married Woman Commits Suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

Feb 7 2019 7:01 AM | Updated on Feb 7 2019 7:01 AM

Married Woman Commits Suicide - Sakshi

పరిమళ (ఫైల్‌)

విశాఖపట్నం ,గాజువాక: భర్తతో తలెత్తిన ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చైతన్యనగర్‌కు చెందిన పి.శేషుబాబు ఫార్మా కంపెనీలోని లారస్‌ ఫార్మాష్యూటికల్స్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన పరిమళ (29)తో ఆరు నెలల క్రితం వివాహమైంది. శేషుబాబు కంపెనీ పనిమీద ఊరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి రెండు రోజుల క్రితం వెళ్లాడు. ఈ నేపథ్యంలో పరిమళ లారస్‌ కంపెనీకి బుధవారం వెళ్లి భర్త ఆచూకీ కోసం అడిగింది. ఇంటర్వ్యూల కోసం అతడు విజయవాడ వెళ్లినట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అక్కడి నుంచి భర్తకు ఫోన్‌ చేసి మాట్లాడిన పరిమళ ఇంటికి చేరుకుంది. అనంతరం ఫ్యాన్‌ హుక్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. దీన్ని గమనించిన స్థానికులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తతో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని, అందువల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ప్రసాద్‌ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నట్టు సీఐ కె.రామారావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement