చిచ్చురేపిన చెవిదిద్దులు..

Married Woman Commit Suicide In East Godavari - Sakshi

భార్యాభర్తల మధ్య వివాదం

ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వివాహిత

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్‌: భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదంలో బుధవారం రాత్రి మోరంపూడి సాయినగర్‌కు చెందిన లావేటి రాజరాజేశ్వరి(19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏడాదిన్నర క్రితం పెట్రోలు బంకులో పని చేస్తున్న సమయంలో రాజరాజేశ్వరి ఆటోడ్రైవర్‌ లావేటి మోహన్‌ల మధ్య స్నేహం ప్రేమగా మారి కొవ్వూరు కృష్ణునిగుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం మోరంపూడి సాయినగర్‌లోని రేకులో షెడ్డులో కాపురం ఉంటున్నారు. రాజేశ్వరికి తల్లి పోలవరపు వరలక్ష్మి సుమారు నాలుగు గ్రాములు బంగారపు చెవిదిద్దులు చేయించి ఇచ్చింది. అయితే తల్లికి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుమార్తెకి చెందిన చెవిదిద్దులను తీసుకుని వెళ్లి తనఖాపెట్టారు.

దీంతో బుధవారం రాజేశ్వరి, మోహన్‌ల మధ్య ఈ విషయంపై వాగ్వివాదం చోటుచేసుకుంది. రాజేశ్వరి ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్‌ చేసి చెప్పడంతో రాత్రి 7.30 గంటలకు ఆమె కుమార్తె ఇంటికి వచ్చి అల్లుడితో మాట్లాడింది. అయితే మోహన్‌ తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, ఆ చెవిదిద్దులు ఇస్తే తనఖాపెట్టి ఇబ్బందులు తొలగించుకుంటానని తెలిపాడు. దీంతో అత్త వరలక్ష్మి ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, తరువాత విడిపిస్తానని తెలిపింది. ఈ లోపు అల్లుడు కోపంతో బట్టల బ్యాగు తీసుకుని ఆటో వేసుకుని వెళ్లిపోయాడు. ఈలోపు తల్లి, తమ్ముడు బయట మాట్లాడుకుండగానే లోపలికి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాజేశ్వరి రాలేదు. దీంతో తల్లి వరలక్ష్మి లోపలికి వెళ్లి చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంది. వెంటనే ఉరి విప్పి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రాజేశ్వరి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. రాజేశ్వరి తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ కేఎన్‌ మోహన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో తహసీల్దార్‌ కె.పోసిబాబుశవపంచనామా నిర్వహించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top