లొంగిపోయిన బీజేపీ బహిష్కృత నేత | Manoj Baitha surrenders to Bihar police in Hit and Run Case | Sakshi
Sakshi News home page

లొంగిపోయిన బీజేపీ బహిష్కృత నేత

Published Wed, Feb 28 2018 10:36 AM | Last Updated on Wed, Feb 28 2018 1:04 PM

Manoj Baitha surrenders to Bihar police in Hit and Run Case - Sakshi

సాక్షి, పాట్నా: హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు, తొమ్మిది మంది చిన్నారుల మృతికి కారకుడైన బీజేపీ బహిష్కృత నేత మనోజ్ బైతా పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితుడు బైతాను తొలుత శ్రీక్రిష్ణ మెడికల్-హాస్పిటల్‌లో చేర్పించామని, మెరుగైన వైద్యం కోసం పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ శివార్లలో ఉన్న ఝంజా గ్రామంలో గత శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు రోడ్డు దాటేందుకు 9 మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో తన ఎస్‌యూవీ కారులో అటుగా వెళ్తున్న బీజేపీ నేత మనోజ్ బైతా తన వాహనంతో విద్యార్థులను ఢీకొడుతూ వారిపైనుంచి దూసుకెళ్లాడు. మరో 20 మందిని వాహనంతో ఢీకొట్టారు. అనంతరం భయందోళనకు గురైన బైతా తన వాహనాన్ని అక్కడే వదిలి పరారైన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదంలో స్కూలు విద్యార్థులు 9 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు.  బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ శివార్లలో ఉన్న ఝంజా గ్రామంలో చోటుచేసుకుంది.
 
అదే ప్రమాదంలో గాయపడ్డ నిందితుడు బైతాను ముజఫర్‌పూర్‌కు  తీసుకెళ్తే మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, గాయపడ్డవారి బంధువులు, సన్నిహితులు దాడిచేసే ప్రమాదం ఉందని చికిత్స కోసం పాట్నాకు తరలించినట్లు తెలిపారు. కాగా, మద్యం మత్తులో వాహనం నడిపి చిన్నారుల మృతికి కారణమైన ప్రమాదంపై బీజేపీ నేతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మనోజ్ బైతాను పార్టీ నుంచి ఆరేళ్లపాటు ఇదివరకే బహిష్కరించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement