వనస్థలిపురంలో వ్యక్తి దారుణ హత్య

A Man Was Murdered In Vanastalipuram - Sakshi

హైదరాబాద్‌ : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పనామా వద్ద ఉన్న రైతు చికెన్ బజార్‌లో పనిచేస్తోన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గిరి అనే వ్యక్తి, చికెన్‌ షాపులో పనిచేస్తోన్న కృష్ణ చైతన్య(30) అనే వ్యక్తిని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్‌లో వేసి పరారయ్యాడు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top