బొమ్మ తుపాకీతో బ్యాంక్ లూటీకి ప్లాన్ | Man tries to rob bank with dummy gun gets arrested | Sakshi
Sakshi News home page

బొమ్మ తుపాకీతో బ్యాంక్ లూటీకి ప్లాన్

Oct 29 2018 4:49 PM | Updated on Oct 29 2018 4:55 PM

Man tries to rob bank with dummy gun gets arrested - Sakshi

సాక్షి, అనంతపురం : ఓ వ్యక్తి బొమ్మ తుపాకీని చూపించి బ్యాంకులో దోపిడీకి యత్నించాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కరూర్ వైశ్య బ్యాంకులో చోటుచేసుకుంది. బ్యాంకులో ఉన్న వారు అప్రమత్తమై దోపిడీకి యత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు. తీరా అతని చేతిలో ఉంది బొమ్మతుపాకీ అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. బొమ్మతుపాకీ కొనుక్కొచ్చి దోపిడీకి స్కెచ్ వేశాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. దుండగుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement