అత్తగారింటి ఎదుట అల్లుడి ఆత్మహత్యాయత్నం | Man Suicide Attempt In Kagaznagar | Sakshi
Sakshi News home page

అత్తగారింటి ఎదుట అల్లుడి ఆత్మహత్యాయత్నం

May 26 2018 2:16 PM | Updated on May 26 2018 2:16 PM

Man Suicide Attempt In Kagaznagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కాగజ్‌నగర్‌రూరల్‌ : కట్నంగా ఇచ్చిన భూమిని పట్టా చేయనందుకు అల్లుడు ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంఘటన కాగజ్‌నగర్‌ మండలంలోని చింతగూడ కోయవాగు గ్రామంలో చోటు చేసుకుంది. కాగజ్‌నగర్‌రూరల్‌ ఇన్‌చార్జి ఎస్సై సిరాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

చింతగూడకు చెంది న చిట్యాల జలందర్‌ అదే గ్రామానికి చెందిన లక్ష్మి, పోచయ్యల కుమార్తెను ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో చింతగూడ గ్రామం శివారులోని 1.5ఎకరాల భూమిని వరకట్నంగా ఇచ్చారు.

8 సంవత్సరాలుగా అత్తమామలు అల్లుడికి కౌలు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ సంవత్సరం ఆ భూమిని రూ.40వేలకు కుదువ పెట్టారు. విషయం తెలుసుకున్న అల్లుడు ఆ డబ్బులతో పాటు భూమిని తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

ఈ క్రమంలో బాధితుడు తాగిన మైకంలో గురువారం రాత్రి అత్తమామ ఇంటిముందు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేందానికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తరలిం చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement