దారుణం: ప్రియురాలు గుడ్‌బై చెప్పిందని.. | Man Killed His Girlfriend And Family Members In Australia | Sakshi
Sakshi News home page

దారుణం: తనకు గుడ్‌బై చెప్పిందని ‍ప్రియురాలిని..

Oct 6 2019 5:56 PM | Updated on Oct 6 2019 5:56 PM

Man Killed His Girlfriend And Family Members In Australia - Sakshi

కాన్‌బెర్రా: తనకు గుడ్‌బై చెప్పి మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుపుతోందన్న కారణంతో ప్రియురాలిపై ఓ వ్యక్తి దారుణంగా కక్ష తీర్చుకున్నాడు. ప్రియురాలిని, ఆమె ప్రియుడిని, ఆమె కుటుంబ సభ్యులను కిరాతంగా కాల్చి హత్య చేశాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. ఆస్ట్రేలియాకి  చెందిన 25 ఏళ్ల యువకుడు, స్థానిక యువతి (19) గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల అతనికి బ్రేకప్‌ చెప్పిన ఆ యువతి మరో వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో తీవ్ర అవమానానికి, ఆగ్రహానికి గురైన అతను ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ యువతి ఇంట్లో అందరూ ఉన్న సమయంలో తుపాకీతో ఒక్కసారిగా దాడికి దిగాడు. దీంతో కొన్ని క్షణాల్లోనే ఆ యువతి, ఆమె ప్రియుడు, కుటుంబ సభ్యలు అతని తూటాలకు బలైపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోని తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement