ప్రేమ పేరుతో వేధింపులు..  | Man Harassed Woman In The Name Of Love In Malkajgiri | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వేధింపులు.. 

Nov 19 2019 9:39 AM | Updated on Nov 19 2019 9:39 AM

Man Harassed Woman In The Name Of Love In Malkajgiri - Sakshi

సాయిప్రసాద్‌(35)

సాక్షి, మల్కాజిగిరి: ప్రేమ పేరుతో ఓ విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిని మల్కాజిగిరి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి వాణీనగర్‌కు చెందిన సాయిప్రసాద్‌(35) ప్రైవేట్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అతను అదే ప్రాంతానికి చెందిన విద్యార్థిని వెంటపడుతూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లి తండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం దయానంద్‌నగర్‌ స్టేషన్‌ వద్ద సాయిప్రసాద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా  పట్టుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement