సెల్‌ చార్జర్‌ను తీస్తుండగా. | Man Died Of Electric Shok | Sakshi
Sakshi News home page

షాక్‌తో యువకుడి మృతి..    

Apr 2 2018 12:00 PM | Updated on Sep 5 2018 2:26 PM

Man Died Of Electric Shok - Sakshi

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

చిన్నశంకరంపేట(మెదక్‌): సెల్‌పోన్‌ చార్జర్‌ను ప్లగ్‌ నుంచి తొలగిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన మెంతం గారి నర్సింలు కుమారుడు శ్రీకాంత్‌(20) ఆదివారం ఉదయం ఇంట్లో సెల్‌పోన్‌కు చార్జింగ్‌ పెట్టాడు. అనంతరం ప్లగ్‌ నుంచి చార్జింగ్‌ తీస్తుండగా షాక్‌కి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌ని తూప్రాన్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే లోపే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నశంకరంపేట ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్‌ తెలిపారు.∙  
 

Advertisement
 
Advertisement
Advertisement