చికిత్స పొందుతూ భాస్కర్‌ మృతి

Man Committed Suicide  - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం : పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ప్రియురాలి ఇంటి ఎదుట పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన భాస్కర్‌(24) జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి ప్రాణాలు వదిలాడు. హైదరాబాద్‌ బొరబండ సంజయ్‌నగర్‌ కాలనీకి చెందిన భాస్కర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డాడు. అమ్మాయి తరుపు కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం భాస్కర్‌ ఇంటికి వెళ్లి నచ్చజెప్పి వచ్చాడు. అయినా వినకుండా ఆమె ఇంటిచుట్టూ తిరిగాడు.

మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పరిసరాలలో తిరిగాడు. అదేరోజు రాత్రి నిద్రమాత్రలు మింగి ఆకస్మరక స్థితిలోకి వెళ్లాడు. వైద్యం చేయించుకుని అంతటితో ఆగకుండా గురువారం ఉదయం మళ్లీ మహబూబ్‌నగర్‌కు చేరుకుని ప్రియురాలి ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్సపొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు. ఈ సంఘటనపై న్యాయం చేయాలని శుక్రవారం ఉదయం మృతుడి తండ్రి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు ఇచ్చిన వాగ్మూలం ప్రకా రం 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top