డీఎన్‌ఏ పరీక్షల్లో దొరికిపోయాడు | Man Caught in DNA Test Cheating Case | Sakshi
Sakshi News home page

డీఎన్‌ఏ పరీక్షల్లో దొరికిపోయాడు

Dec 10 2018 11:17 AM | Updated on Dec 10 2018 11:17 AM

Man Caught in DNA Test Cheating Case - Sakshi

మోహన్‌ గౌడ(ఫైల్‌)

దొడ్డబళ్లాపురం: ఆ అమ్మాయిని ప్రేమించానన్నాడు.. శారీరకంగా లొంగదీసుకున్నాడు.. తీరా గర్భవతి అని తెలిసి నువ్వెవరో తెలీదన్నాడు..అయితే ఆ మోసగాడు డీఎన్‌ఏ పరీక్షల్లో అడ్డంగా దొరికిపోయాడు.. నెలమంగల తాలూకా చిక్కగొల్లరహట్టి గ్రామానికి చెందిన మోహన్‌గౌడ (30)ఈ కథలో హీరో కం విలన్‌... మోహన్‌గౌడ స్థానిక యువతి (22)ని కొన్నాళ్లుగా ప్రేమించానని నాటకమాడి శారీరకంగా లొంగదీసుకుని తీరా ఆమె గర్బవతి అని తెలిసి నువ్వెవరో తెలీదన్నాడు. అయినా యువతి ధైర్యంతో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మోహన్‌గౌడ పలుమార్లు రౌడీలను పంపించి బెదిరించాడు. యువతిని పెద్దమర్రిచెట్టు (దొడ్డాలదమర) వద్ద ఉన్న లాడ్జికి తీసికెళ్లి బలవంతంగా శారీరక సంబంధం ఏర్పరచుకుని వీడియోతీసి బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేసాడు.

కొన్నాళ్లకు యువతి గర్భవతి అని తెలిసి దూరం పెట్టాడు. దీంతో యువతి తల్లిదండ్రులతో కలిసి మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పో లీసులు మోహన్‌గౌడను అరెస్టు చేసి జైలుకు కూడా పంపిం చారు. కేసు నెలమంగల జేఎంఎఫ్‌సీ కోర్టులో విచారణ జరిగింది. కోర్టులో యువతికి పుట్టిన బిడ్డకు తనకూ సంబంధం లేదని మోహన్‌గౌడ వాదించాడు. అయితే కోర్టు పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని డీఎన్‌ఏ పరీక్షకు ఆ దేశించింది. ఇప్పుడు బిడ్డ మోహన్‌గౌడకు కలిగిందే అని డీఎన్‌ఏ పరీక్షలు తేల్చాయి. కోర్టు డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించడానికి పోలీసులు సేకరించిన సాక్ష్యాలు కలిసివచ్చాయి. యువతితో మోహన్‌గౌడ దిగిన లాడ్జీ సీసీటీవీ ఫుటేజీ, ఇద్దరూ కారు, బైక్‌లపై తిరిగిన వీడియోలు, ఫోన్‌ కాల్‌ రికార్డ్‌లు సేకరించిన పోలీసులు వాటన్నిటినీ కోర్టుకు సమర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement