అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్య | Man Brutal Murder In Nalgonda | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్య

Jun 7 2019 8:34 AM | Updated on Jun 7 2019 8:34 AM

Man Brutal Murder In Nalgonda - Sakshi

గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన శ్రీను తుపాకుల శ్రీను(ఫైల్‌)

వేములపల్లి : మండలంలోని సల్కునూరు గ్రామంలో ఓ వ్యక్తి గురువారం దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్కునూరు గ్రామానికి చెందిన తుపాకుల శ్రీను(42)కు కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళతో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పదేళ్ల వరకు వీరి సంసారం సాఫీగా జరిగింది. అనంతరం తరచు ఇరువురి మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో భార్య తల్లిగారింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ కూలి పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం రాత్రి సమయంలో గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న బండరాయి అరుగుపై నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో అర్ధరాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు మెడపై మరణాయుధంతో పొడిచి చంపినట్లు తెలిపారు. గురువారం ఉదయం బండరాయి అరుగుపై రక్తపు మడుగులో మృతిచెందిన శ్రీనును గుర్తించిన స్థానికులు పోలీసులకు, వీఆర్‌ఓకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు.

సంఘటన స్థలాన్నిపరిశీలించిన పోలీసులు
ఎస్‌ఐ, సీఐకు సమాచారం అందించగా సీఐ రమేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకొని జాగిలాలను తెప్పించి పరిశీలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అదేవిధంగా గ్రామస్తులు అతని తల్లి, తమ్ముడిని విచారించగా హత్యకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదని తెలిపారు. వీఆర్‌ఓ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ కేసు నమోదు చేసుకోగా సీఐ రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలను త్వరలో ఛేదిస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement