
సాక్షి, హావేరి: తాలూకాలోని హుల్లత్తి గ్రామ దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామిజీ (38) ఆత్మహత్య చేసున్నారు. అంతకుముందు ఆయన గదగ జిల్లా శిరహట్టి తాలూకాలోని బాలేహోసురుకు చెందిన దింగాలేశ్వర మఠంలో ఉండేవారు. కొన్ని నెలల క్రితమే స్వామిజీ దింగాలేశ్వర శాఖకు వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి మఠంలో ఎవరు లేని సమయం చూసి స్వామిజీ డెత్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నారు.
సోమవారం తెల్లవారు జామున మఠానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని హానగల్ పోలిసులకు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. డెత్‌నోట్‌లో తన మరణానికి ఎవరూ కారణం కాదని, గత కొంత కాలంగా తనకు మనశ్శాంతి లేదని, దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. తనను ఇదే మఠంలో సమాధి చేయాలని అందులో కోరాడు.