ప్రియుడు పెళ్లికిఒప్పుకోలేదని ఆత్మహత్య.. | Love Failure Young Women Commits Suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

May 2 2019 1:03 PM | Updated on May 2 2019 1:03 PM

Love Failure Young Women Commits Suicide - Sakshi

గీత (ఫైల్‌)

గజపతినగరం రూరల్‌: గజపతినగరం ఠానా వీదికి చెందిన కర్రి గీత (22) మనస్తాపంతో బుధవారం ఇంటిలోనే ఉరివేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. బొండపల్లి మండల కేంద్రానికి చెందిన గవిరెడ్డి క్రాంత్‌ అనే యువకుడిని గీత ప్రేమించింది. క్రాంత్‌ ప్రస్తుతం జమ్మూలో ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తుండగా... గీత పాలిటెక్నికల్‌ కోర్సు పూర్తి చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకుందామని గీత పలుమార్లు క్రాంత్‌ను ప్రశ్నించగా.. తర్వాత చేసుకుందాంలే అని బదులివ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గీత ఇంటిలో ఉరి వేసుకుని  ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆమెను గజపతినగరం సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గీత మృతితో తల్లిదండ్రులు ఈశ్వరరావు, మంగమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement