అయ్యో.. రామ | Lorry Accident In Rangareddy | Sakshi
Sakshi News home page

అయ్యో.. రామ

Apr 16 2019 12:54 PM | Updated on Apr 16 2019 12:54 PM

Lorry Accident In Rangareddy - Sakshi

వాహనంలో చిక్కుకున్న బాలిక శివకళ , అనంతయ్య (ఫైల్‌)

యాలాల: శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న భక్తుల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాలాల మండలం దౌలాపూర్‌ సబ్‌స్టేషన్‌ సమీ పంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జుంటుపల్లి ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం సిరిమానగారి అనంతయ్య (55), భార్య లక్ష్మి (45), కుమార్తె శివకళ, తాండూరుకు చెందిన తుల్జమ్మ (38), భారతమ్మ (45) వేర్వేరుగా సోమవారం యాలాల మం డలం జుంటుపల్లిలో జరిగిన రామస్వామి జాతరకు వచ్చారు.

అనంతరం వారంతా తాండూరు వెళ్లేందుకు అక్కంపల్లి గ్రామానికి చెందిన అశోక్‌ ఆటోలో ఎక్కారు. ఐదుగురు ప్రయాణికులతో తాండూరుకు వెళ్తున్న ఆటోను దౌలాపూర్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోకి రాగానే తాండూరు నుంచి కొడంగల్‌ వైపు వెళుతున్న ఓ లారీ ఢీకొట్టింది. అయితే రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతను తప్పించబోయి డ్రైవర్‌ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అనంతయ్య, లక్ష్మి, తుల్జమ్మ, భారతమ్మæ ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఆటో డ్రైవర్‌ అశోక్, శివకళ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ ఉపేందర్, యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement