చిరంజీవి అల్లుడికి సైబర్‌ వేధింపులు

Kalyan Dev Filed Complaint In Cyber Crime Police Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సైబర్‌ నేరగాళ్లు ప్రముఖులను సైతం వదలడం లేదు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు, హీరో కల్యాణ్‌ దేవ్‌కు సైబర్‌ వేధింపులు మొదలయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో  అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ ఆయనను వేధిస్తున్నారు. కొంతమంది ఆగాంతకులు ఇన్‌స్టాగ్రామ్‌లో తనపై, తన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో కల్యాణ్‌ దేవ్‌ ఫిర్యాదు చేశారు. హీరో కల్యాణ్ దేవ్‌ ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కల్యాణ్‌ దేవ్‌ను వేధిస్తున్న 10 మందిని గుర్తించామని, వారి వివరాల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ వారికి లేఖ రాశామని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే వారి పట్టుకొని చర్యలు తీసుకుంటామని సైబర్‌ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీ రఘువీర్‌ మీడియాకు తెలిపారు.

( చదవండి : రెండో పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top