కార్డన్‌ సెర్చ్‌.. అదుపులో మైనర్‌ ప్రేమజంట! | Joint cordon and search operations in Hyderabad | Sakshi
Sakshi News home page

Feb 24 2018 10:37 AM | Updated on Sep 4 2018 5:07 PM

Joint cordon and search operations in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్‌లోని దేవేందర్ నగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి.. సరైన పత్రాలు లేని 15 బైకులు, రెండు ఆటోలు, 51 గ్యాస్ సిలిండర్లు, 20 లీటర్ల డీజిల్, రెండు గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక మైనర్‌ ప్రేమజంటను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో 11మంది అనుమానితులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్డన్‌ సెర్చ్‌లో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ గోనె సందీప్‌ సహా 300 మంది పోలీసులు పాల్గొన్నారు.

బొట్టుగూడలోనూ..
నల్లగొండ :
శనివారం ఉదయం 4 గంటల నుంచి బొట్టుగూడ కాలనీలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఇద్దరు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 50 మంది మహిళా సిబ్బంది, మొత్తం 300 మంది పోలీసులు పాల్గొన్నారు. బొట్టుగూడ పరిధిలో ఎలాంటి పత్రాలు 36 బైకులు, 11 ఆటోలు,  2 కార్లు, ఒక గుట్కా డబ్బా, 34 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మట్లాడుతూ..  ఎవరైనా  అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తెలుపాలని, పరిచయం లేని వారికి ఇల్లు అద్దెకు ఇవ్వవద్దని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement