చెంచులక్ష్మికి పెట్రోల్‌ బంక్‌లో ఉద్యోగం | Job In Chanchalguda Petrol Bunk For Chenchu Laxmi | Sakshi
Sakshi News home page

చెంచులక్ష్మికి పెట్రోల్‌ బంక్‌లో ఉద్యోగం

Nov 10 2018 9:18 AM | Updated on Sep 3 2019 9:06 PM

Job In Chanchalguda Petrol Bunk For Chenchu Laxmi - Sakshi

చెంచు లక్ష్మి (ఫైల్‌)

చంచల్‌గూడ: 18 చోరీ కేసుల్లో మూడు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఘరనా దొంగ చెంచు లక్ష్మీ శుక్రవారం చంచల్‌గూడ మహిళా జైలు నుంచి విడుదలైంది.తరువాత ఆమెకు చంచల్‌గూడలోని మహిళ పెట్రోల్‌ బంకుల్లో ఉద్యోగమించ్చారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోరి కేసుల్లో చెంచు లక్ష్మీ (34) నిందితురాలుగా ఉంది. కాగా పలు కేసుల్లో ఆమె దోషిగా తేలడంతో కోర్టు ఆమె శిక్షలు విధించింది. ఎట్టకేలకు ఆమె జైలు శిక్ష పూర్తి కావడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలైంది.

కాగా పోలీసులే తనను దొంగగా మార్చారని పలు సందర్భాల్లో ఆమె పోలీసు శాఖపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై జైలు అధికారులతో ఆమె మొరపెట్టుకోగా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోఅధికారులు చెంచు లక్ష్మీకి చంచల్‌గూడలోని మహిళ పెట్రోల్‌ బంకుల్లో ఉపాధి కల్పించడంతో ఇల్లు ఏర్పాటు చేసి  కొంత డబ్బు కూడా చెల్లించినట్లు జైలు సూపరింటెండెంట్‌ బషీరాబేగం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement