చికిత్స పొందుతున్న మానస
జవహర్‌నగర్: ఇటీవల విడుదల ఇంటర్ రివాల్యుయేషన్ ఫలితాల్లో మార్కులు రాలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దమ్మాయిగూడకు చెందిన మానస ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల ఇంటర్ రివాల్యుయేషన్‌లో మార్కులు పెరగలేదని మనస్తాపానికిలోనైన ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మానస ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
