నిందితుడి భార్యతో అసభ్య ప్రవర్తన

Indecent Behavior With The Wife Of The Offender - Sakshi

ఖమ్మం జిల్లా: రాపర్తి ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి నిందితుడి భార్యతో ఎక్సైజ్‌ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. స్థానిక ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్‌ నిన్న రాత్రి తన స్నేహితులతో కలిసి పోలీస్‌స్టేషన్‌లోనే పార్టీ చేసుకున్నాడు. నిన్న రాత్రి అక్రమంగా బెల్టు షాపు నిర్వహిస్తున్నాడని భద్రం అనే ఓ వ్యక్తిని ఎక్సైజ్‌ పోలీసులు తీసుకువచ్చారు. కొడతారేమోనని భావించి అదే సమయంలో నిందితుడి భార్య, కుమారుడు స్టేషన్‌కు వచ్చారు. ఒంటరిగా ఉండటం గమనించి మద్యం మత్తులో ఆమెను గదిలో పెట్టి లాక్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు.

మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు వచ్చి టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం మాట్లాడదామని ఎస్‌ఐ, బాధితులకు సర్ధి చెప్పి పంపించారు. ఈ విషయమై సోమవారం నిందితుడిని వివరణ కోరగా..తన భార్యను వదిలిపెట్టమని బతిమిలాడుకున్నానని అయినా పోలీసులు కనికరించలేదని, స్థానికులు రావడంతో గండం నుంచి గట్టెక్కామని మీడియా ఎదుట వాపోయారు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top