ఎయిర్‌పోర్ట్ ఉద్యోగిని పట్ల అసభ్య ప్రవర్తన

Indecent behavior with Airport employee in Shamshabad - Sakshi

సాక్షి, శంషాబాద్ : శంషాబాద్‌లో ముగ్గురు యువకులు హంగామా చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని పట్ల మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించారు. ఎయిర్ పోర్ట్‌లో డ్యూటీ ముగించుకుని శంషాబాద్‌లో క్యాబ్ దిగి నడుచుకుంటూ వస్తున్న యువతిపై వెనకాలే బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు మద్యం చల్లారు. ఒక్కసారిగా ఊహించని ఘటన ఎదురవ్వడంతో షాక్‌కు గురైన యువతి గట్టిగా కేకలు పెట్టింది. దీంతో కేకలు విన్న యువకులు మద్యం బాటిళ్లను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ సంఘటనపై యువతి ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top