సొంత కూతురినే పెళ్లి చేస్కొని.. | Incest Case US Man Kills Daughter and Their Son | Sakshi
Sakshi News home page

Apr 14 2018 11:42 AM | Updated on Apr 14 2018 11:45 AM

Incest Case US Man Kills Daughter and Their Son - Sakshi

స్టీవెన్‌-క్యాటీ చిత్రాలు (ఫైల్‌ ఫోటోలు)

లిట్చ్‌ఫీల్డ్‌ కౌంటీ : కన్న కూతురినే వివాహం చేస్కొని.. ఆమెతో కొడుకుని సైతం కన్నాడు ఓ వ్యక్తి. ఆమెపై అనుమానం పెంచుకుని ఆమెను-కొడుకును చంపేశాడు. చివరకు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్‌ కరోలినాకు చెందిన  స్టీవెన్‌ ప్లాదల్‌(42) తన కూతురు క్యాటీ(20)ని చిన్నతనంలోనే న్యూయార్క్‌కు చెందిన ఆంటోనీ ఫస్కో అనే వ్యక్తికి దత్తత ఇచ్చేశాడు. అయితే స్టీవెన్‌ మాత్రం గత కొన్నేళ్లుగా కూతురితోనే సంబంధం నెరుపుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో వీరికి వివాహం కాగా..  ఓ కొడుకు కూడా జన్మించాడు. 

చివరకు పెంపుడు తండ్రి వీరిద్దరి బంధానికి అడ్డుచెప్పటంతో.. క్యాటీ స్టీవెన్‌కు బ్రేకప్‌ చెప్పేసింది. అయితే స్టీవెన్‌ మాత్రం ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందేమోనన్న అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. కొడుకు బెన్నెట్‌ను స్టీవెన్‌ చంపేశాడు. అనంతరం క్యాటీ, ఆమె పెంపుడు తండ్రి ఆంటోనీని ఓ ట్రక్కులో కొంత దూరం తీసుకెళ్లి కాల్చి చంపాడు. ఘటన తర్వాత పారిపోయిన స్టీవెన్‌ తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు స్టీవెన్‌ తన తల్లికి పూర్తి సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. న్యూమిల్‌ఫోర్డ్‌ సమీపంలోని ఓ ట్రక్కులో వీరిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. లిట్చ్‌ఫీల్డ్‌ కౌంటీలో స్టీవెన్‌ మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. స్టీవెన్‌ భార్య విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement