విజయ్ని డబ్బులు డిమాండ్ చేయలేదు | I was never demanded money from Vijay: Vanithareddy | Sakshi
Sakshi News home page

విజయ్ని డబ్బులు డిమాండ్ చేయలేదు

Dec 27 2017 5:59 PM | Updated on Apr 3 2019 8:57 PM

I was never demanded money from Vijay: Vanithareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ కమెడియన్‌ విజయ్‌సాయి భార్య వనితారెడ్డి న్యాయవాదితో కలిసి బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ వచ్చారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించిన విజయ్‌, భార్య వనితపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన చావుకు వనిత, మరో ఇద్దరు కారణమని, వారిని వదిలిపెట్టదని ఈ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో వనితపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిరోజులుగా పరారీలో ఉన్న వనిత.. తాజాగా పోలీసుల విచారణకు హాజరయ్యారు.

పోలీసులు సరెండర్‌ కావాలని నోటీసులు ఇచ్చారని, అందుకే తాను పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినట్టు వనిత తెలిపింది. ఆమె మీడియాతో ఏమన్నారంటే.. 'విజయ్‌ను నేను వేధించలేదు. అతని సెల్ఫీలో వాస్తవాలు చెప్పలేదు. విజయ్‌ నా పేరు ఎందుకు చెప్పాడో తెలియదు. తల్లిదండ్రలు వేధింపుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పాప తట్టుకోలేదనే భయంతోనే విజయ్ మృతదేహాన్ని చూపించలేదు. సాక్ష్యాల కోసమే ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నా. విజయ్కి నాకు మధ్య మూడేళ్లుగా మాటలు లేవు... పాపను చూడడానికి వచ్చినప్పుడు నన్నే ఇబ్బంది పెట్టే వాడు. నేనెవరినీ బెదిరించలేదు. తప్పు కప్పిపుచ్చుకునేందుకే నాపై విజయ్ తల్లిదండ్రులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. విజయ్ ఆత్మహత్యకు కారణం తెలియదు. నాపై కక్ష తీర్చుకునేందుకే సూసైడ్ నోట్లో విజయ్ నాపేరు రాసి ఉంటాడు. విజయ్ని డబ్బులు డిమాండ్ చేయలేదు. నేను తప్పు చేయలేదనే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేనెప్పుడు విజయ్ పై పగ తీర్చకోవాలనుకోలేదు. విజయ్ ఆత్మహత్యకు నేను తీసుకెళ్ళిన కారు  కారణం కాదు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తా' అని వనితారెడ్డి తెలిపారు. విచారణ అనంతరం 41 సీఆర్పీసీ నోటీసు కింద వనితను పోలీసులు ఇంటికి పంపించారు. వనిత దగ్గర ఉన్న అధారాలతో మూడు రోజుల్లో మళ్లీ విచారణకు హాజరవ్వాలని పోలీసులు చెప్పారు.

విజయ్ని డబ్బులు డిమాండ్ చేయలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement