సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే టార్గెట్‌గా బిజినెస్‌.. | Hyderabad: Sex racket targetting software employes busted | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే టార్గెట్‌గా బిజినెస్‌..

Jan 16 2018 5:16 PM | Updated on Oct 22 2018 7:42 PM

Hyderabad: Sex racket targetting software employes busted - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : పెద్దమొత్తంలో జీతాలు పొందే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టైంది. ముఠాలో ప్రధాన సూత్రధారితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులు పట్టుబడ్డారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌ నగర్‌ ప్రాంతంలో గల ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో కొన్నేళ్లుగా వ్యభిచారకలాపాలు జరుగుతున్నాయి. పక్కా సమాచారంతో పోలీసులు మంగళవారం ఆ అపార్ట్‌మెంట్‌పై దాడిచేశారు. దందా నిర్వాహకుడితోపాటు ముంబై, కోల్‌కతా, గోవా రాష్ట్రాలకు చెందిన యువతులను అదుపులోకి తీసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే లక్ష్యంగా వీరు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, గడిచిన రెండేళ్లుగా బిజినెస్‌ నడుపుతున్నారని పోలీసులు చెప్పారు.

అరెస్టైన వ్యక్తి పేరు షేక్‌ ఫహద్‌ అని, ఈ వ్యవహారంతో సంబంధమున్న మరో ఏడుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సదరు అపార్ట్‌మెంట్‌ యజమాని ముంబైలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మిగతావారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement