కోడి కూర కోసం కొట్లాట.. దారుణ హత్య | Hyderabad Man Killed In Fight Over Chicken Curry | Sakshi
Sakshi News home page

Apr 2 2018 4:10 PM | Updated on Sep 4 2018 5:07 PM

Hyderabad Man Killed In Fight Over Chicken Curry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ నిశ్చితార్థ వేడుకలో కోడి కూర కారణంగా రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కొట్లాటలో ఓ యువకుడు హత్యకు గురైయ్యాడు. 

చార్మినార్‌  హుస్సాయినీ అలమ్‌లోని ఓ పంక్షన్‌ హాల్‌లో సోమవారం ఓ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో చికెన్‌ కర్రీ కోసం అతిథుల్లో కొందరు గొడవ చేశారు. ఆలస్యంగా కూరను వడ్డించారంటూ పెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వాళ్లు బయటకు వెళ్లి మరో 15 మందిని వెంటపెట్టుకొచ్చి కత్తులతో పంక్షన్‌హాల్‌లో వీరంగం సృష్టించారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గాయాలపాలైన మరో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement