ఆత్మహత్యాయత్నం... భార్యకు వీడియో కాల్‌ | Husband Video Call to wife While Suicide Attempt in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకుంటున్నా...

Jun 26 2020 10:30 AM | Updated on Jun 26 2020 10:30 AM

Husband Video Call to wife While Suicide Attempt in Hyderabad - Sakshi

ఆత్మహత్యాయత్నానికి యత్నించిన రామకృష్ణ

అబిడ్స్‌:  రైలు కిందపడి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ వ్యక్తి తన భార్యకు వీడియోకాల్‌ చేశాడు.ఆందోళన చెందిన ఆమె వెంటనే  పోలీసులకు సమాచారమందించడంతో వారు కాపాడగలిగారు. వివరాలు..  టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌ పరిదిలోని మార్కండేయ నగర్‌లో రామకృష్ణ(34) దంపతులు నివాసముంటున్నారు. గురువారం సాయంత్రం భార్య శైలజకు రామకృష్ణ లక్డీకాపూల్‌లోని రైల్వే ట్రాక్‌పై నిలబడి తాను రైలు కిందపడి చనిపోతానని కాల్‌ చేశాడు. ఆమె 100కు ఫోన్‌ చేయడంతో పోలీస్‌ సెట్‌ ద్వారా సమాచారం తెలుసుకున్న టప్పాచబుత్ర అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు 10 నిమిషాల్లోపు లక్డీకాపూల్‌ నాంపల్లి రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నారు. రైలు వస్తుండటంతో అతనిని వెంటనే లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement