పిల్లలతో కలిసి భర్తను అంతమొందించిన భార్య | Husband Murder Case In Prakasam | Sakshi
Sakshi News home page

పిల్లలతో కలిసి భర్తను అంతమొందించిన భార్య

Aug 6 2018 11:03 AM | Updated on Aug 6 2018 11:03 AM

Husband Murder Case In Prakasam - Sakshi

ఆనందరావు మృతదేహం

పొదిలి(ప్రకాశం): ఏళ్ల తరబడి భర్త పెడుతున్న చిత్రహింసలు, వేధింపులు తాళలేక ఓ భార్య తన పిల్లలతో కలిసి భర్తను కర్కశంగా అంతమొందించింది. ఈ సంఘటన పట్టణంలోని సీఐ కార్యాలయానికి కూతవేటు దూరం బుగ్గలం ట్యాంకు వద్ద ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లని ఆనందరావు (45), వసంత దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆనందరావు చెక్క రిక్షా బాడుగలకు వెళ్తాడు . భార్య వసంత ఓ వైద్యశాలలో నర్సుగా పని చేస్తోంది. ఆనందరావు రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య, పిల్లలను ఆనందరావు హింసిస్తున్నాడు.

ఎంత సర్ది చెప్పినా పద్ధతి మార్చుకోలేదు. పిల్లల కోసం ఏళ్ల తరబడి ఆమె భర్త వేధింపులు భరించింది. ఇటీవల నుంచి భార్యతో పాటు పిల్లలను కూడా వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆనందరావు ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. భార్య, పిల్లలు ఆనందరావును కర్రలు, రాళ్లతో కొట్టి విచక్షణా రహితంగా చంపారు.

నీటి తొట్టిలో పడి చనిపోయాడని నమ్మించేందుకు మృతదేహాన్ని నీటి తొట్టిలో పడుకోబెట్టారు. కొద్దిసేపటి తర్వాత మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ శ్రీరామ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని వారు పరిశీలించారు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

1
1/1

మృతదేహాన్ని పరిశీలిస్తున్న సిఐ,ఎస్సైలు

Advertisement
 
Advertisement
Advertisement