భర్త కాళ్లు, చేతులు విరగొట్టి.. ఇంట్లో బంధించి!

Husband Legs And Hands Broken By His Wife In East Godavari - Sakshi

సాక్షి, రాజమండ్రి: భర్త అనే మర్యాద, ప్రేమ లేదు.. కనీసం సాటి మనిషి అనే కరుణ లేదు. కట్టుకున్నవాడిని ఇంట్లో నిర్బంధించి ఆరు నెలలుగా చిత్రవదకు గురిచేసిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొమరగిరిపట్నానికి చెందిన సత్యనారాయణకు కొన్నేళ్ల క్రితం వివాహమయింది. మొదట్లో బాగానే నడిచిన వీరి కాపురం, తర్వాత గొడవలకు దారి తీసింది.

ఒక రోజు గొడవ పెరిగి కోపోద్రిక్తురాలైన భార్య సత్యనారాయణ కాళ్లు, చేతుల విరగొట్టింది. బయటకు పొక్కకుండా ఆరు నెలలుగా అతడిని ఇంట్లోనే బంధించి, ప్రతిరోజు అతడిని చిత్రవదలకు గురిచేసింది. భార్య చెర నుంచి తప్పించుకున్న సత్యనారాయణ బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించి సత్యనారాయణను స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top