ఫేస్‌బుక్‌లో పోస్ట్‌.. ఇల్లు గుల్ల | House Robbery In Yaswanthapur Based On Facebook Post | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో పోస్ట్‌.. ఇల్లు గుల్ల

Jun 12 2018 7:53 AM | Updated on Jul 26 2018 5:23 PM

House Robbery In Yaswanthapur Based On Facebook Post - Sakshi

యశవంతపుర: తాను ఊరికి వెళ్తున్నట్లు ఒక మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం, ఆ తరువాత ఆమె ఇంట్లో దొంగలు పడి రూ. 5 లక్షలు విలువ గల బంగారు అభరణాలను దోచుకుపోయిన ఘటన బెంగళూరు ఆర్‌టీ నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆర్‌టీ నగరలో నివాసముంటున్న ప్రేమ అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలసి శని, ఆదివారం సొంతూరికి వెళ్లింది. ‘రెండు రోజులు ఫేస్‌బుక్‌కు విరామం. నేను మా ఊరికి వెళ్తున్నాను’ అని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టింది.

ఇది గమనించిన దొంగలు ఇంటి తాళాలను బద్దలుకొట్టి బీరువాలోని రూ. 5 లక్షలు విలువ గల బంగారు అభరణాలను దోచుకెళ్లారు. సోమవారం ఉదయం ఊరి నుంచి తిరిగొచ్చిన ప్రేమ ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదరుగా ఉండడంతో ఆర్‌టీ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఊరికి వెళ్తున్నట్లు ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ గురించి ఆమె పోలీసులకు తెలిపారు. ఆ విషయమే దోపిడికి కారణమంటూ ప్రేమ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement