జైలు అధికారులపై ఖైదీల దాడి.. చర్లపల్లి జైలులో ఉద్రిక్తత

High Tension In cherlapally Prison In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చర్లపల్లి జైల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. కొంతమంది ఖైదీలు తనఖీలకు వచ్చిన జైలు అధికారులపై విచక్షణా రహితంగా దాడి చేయటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముబారక్‌ కాబిల్‌ ఇర్ఫాన్‌ అనే వ్యక్తి రెండు నెలల కిందట ఓ హత్య కేసులో రిమాండ్‌ ఖైదీగా చర్లపల్లి జైలుకు వచ్చాడు. జైలు అధికారులు బుధవారం జైల్లోని బ్రహ్మపుత్ర బ్యారక్‌లో తనఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇర్పాన్‌తో పాటు మరి కొందరు ఖైదీలు రాజశేఖర్‌ అనే వార్డర్‌పై దాడికి దిగారు.

అంతే కాకుండా అడ్డువచ్చిన రత్న అనే జైలర్‌పైన, డిప్యూటీ జైలర్‌ సంజీవ్‌ రెడ్డిపైనా దాడికి తెగబడ్డారు. దీంతో జైలు అధికారులు ఇర్ఫాన్‌ను సింగిల్‌ సెల్లో నిర్భందించారు. అయితే ఇర్పాన్‌ మానసిక పరిస్థితి సరిగాలేకపోవటం వల్లే రాజశేఖర్‌పై దాడికి దిగాడని జైలు అధికారులు వెల్లడించారు. గాయపడ్డ రాజశేఖర్‌కు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దాడికి దిగిన వారిపై కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు జైలు అధికారులు సిద్ధమవుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top