కోర్టు ఆదేశాలతో కదిలిన మైనింగ్‌ శాఖ

High Court Moved The Orders To Mining Department Regarding TDP MLA Illegal Mining - Sakshi

గుంటూరు :  గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్‌ జరిగిందని హైకోర్టు గుర్తించింది. విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ మైనింగ్‌ శాఖాధికారులు ఆగమేఘాల మీ కదిలారు. కోనంకి, కేశానుపల్లి, సీతారామాపురం సహా ఎనిమిది చోట్ల సర్వే చేసి అక్రమ తవ్వకాల లెక్కలు తీస్తున్నారు. దీనికి సంబంధించి యరపతినేనికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మైనింగ్‌, రెవిన్యూ శాఖాధికారులు విచారణ జరుపుతున్నారు.

ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ విషయమై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను కూడా ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో కాగ్‌ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. మైనింగ్‌ వ్యవహారంపై శ్రీనివాసరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ, కాగ్‌, కేంద్ర మైనింగ్‌ శాఖలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top