హార్వీ వెయిన్‌స్టీన్‌కు 23ఏళ్ల జైలు

Harvey Weinstein Jailed For 23 Years In Molestation Case - Sakshi

న్యూయార్క్‌ : లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌కు 23ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యూయార్క్‌ కోర్టు. ఈ మేరకు న్యాయమూర్తి జేమ్స్‌ బుర్కే తుది తీర్పును బుధవారం వెల్లడించారు. హార్వీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించాలని ఆయన తరపు న్యాయవాదుల బృందం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన బుర్కే ఈ నిర్ణయం తీసుకున్నారు. హార్వేపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై గత ఫిబ్రవరిలో 12మంది సభ్యుల జ్యూరీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పాటు సమీక్ష జరిపిన జ్యూరీ ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చింది. ఈ కేసులో హార్వీకి దాదాపు 29 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని భావించినప్పటికి న్యాయమూర్తి 23 ఏళ్ల జైలు శిక్షను మాత్రమే ఖరారు చేశారు. ( ఐదేళ్లే శిక్ష వేయండి.. లేదంటే చచ్చిపోతాడు! )

కారు ప్రమాదంలో గాయపడి వీల్‌ ఛైర్‌లో ఉన్న హార్వీ మొదటిసారి కోర్టుకు హాజరయ్యారు. తీర్పు వెలువడిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ అంతా అయోమయంగా ఉంది. నేనీ దేశం గురించి బాధపడుతున్నా’నని అన్నారు. కాగా, హార్వీ లైంగిక వేధింపులకు పాల్పడిన దాదాపు 90 మంది నటీమణుల్లో ఏంజెలినా జోలీ, సాల్మా హయాక్‌ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ( 'అతను నన్ను దారుణంగా రేప్‌ చేశాడు' )

చదవండి : 80 మందిని వేధించాడు.. జైలుకు వెళ్లాల్సిందే

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top