పెళ్లి ఇంట విషాదం | Groom Died In Suspicious status | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇంట విషాదం

Mar 3 2018 11:24 AM | Updated on Mar 3 2018 11:24 AM

Groom Died In Suspicious status - Sakshi

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ముత్తుకూరు: అంగరంగ వై భవంగా శనివారం వివాహం చేసుకోవాల్సిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితి లో మృత్యువాత పడ్డాడు. కారులో ఇంటి నుంచి బయలుదేరి కొద్ది గంటలకే సముద్రంలో మునిగి చనిపోయాడు. కన్నవాళ్లకు పుట్టెడు శోకాన్ని మిగిల్చాడు. కృష్ణపట్నం పోర్టు పోలీసుల కథనం ప్రకారం..నెల్లూరు హరనాథపురానికి చెందిన చిల్లర వెంకట శివజయంత్‌ (27) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం వివాహం చేసుకోవాల్సిన తరుణంలో నెల్లూరుకు వచ్చాడు. గురువారం మధ్యాహ్నం మిత్రులను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి ఒంటరిగా కారులో బయలుదేరాడు. కృష్ణపట్నం సముద్రతీరంలో కారుని వదిలి, దక్షణాన పోర్టు వైపు ఒక కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లాడు. శుక్రవారం ఉదయం జయంత్‌ మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణపట్నం పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. కారును పోలీసు స్టేషన్‌ వద్ద ఉంచారు. మృతికి గల కారణాలను విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement