
ప్రతీకాత్మక చిత్రం
నర్సీపట్నం: బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం బలిఘట్టంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. బలిఘట్టం గ్రామానికి చెందిన బాలిక (9) ఆదివారం మధ్యాహ్నం అదే గ్రామంలోని మంచంశెట్టి రామకృష్ణ (32) దుకాణం వద్దకు సరకులు కొనుగోలుకు వెళ్లింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న రామకృష్ణ బాలికపై అత్యాచారం చేశాడు.
ఈ విషయాన్ని బాధితురాలు అమ్మమ్మకు తెలపడంతో ఆమె సోమవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ సింహాద్రినాయుడు తెలిపారు. నిందితునిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు.