మోడల్‌ స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి

Girl Student Suspicious Death In Govt Model School In Suryapet - Sakshi

బాత్‌రూంలో ఉరేసుకున్న నీరజ

అనుమానం వ్యక్తం చేస్తూ బంధువుల ఆందోళన

మఠంపల్లి మోడల్‌స్కూల్‌లో ఘటన

సాక్షి, మఠంపల్లి (హుజూర్‌నగరర్‌) :  అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన మంఠంపల్లి మోడల్‌ స్కూల్‌లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు, తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రఘునాథపాలేనికి చెందిన చలిగంటి కొండయ్య కుమా ర్తె నీరజ (17) మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. నీరజ శనివారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసింది. అనంతరం తండ్రి ఫోన్‌ చేయగా మాట్లాడి పడుకుంది. తెల్లవారిన తర్వాత తోటి విద్యార్థినులు స్నానం చేసేందుకు బాత్‌రూంకు వెళ్లగా గడియ పెట్టి ఉంది. చాలా సేపు వేచి చూసిన అందులో ఉన్న వారు గడియ తీయకపోవడంతో అనుమానంతో విద్యార్థినులు బాత్‌రూం తలుపును బలంగా నెట్టారు. అందులోని దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. అప్పటికే నీరజ బాత్‌రూం వెంటిలేటర్‌కు చున్నీతో ఉరి పెట్టుకుని కనిపించడంతో కేకలు వేశారు. విషయాన్ని స్కూల్‌ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రంజిత్‌కుమార్‌ ఘటన స్థలా న్ని పరిశీలించారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. 

నీరజ మృతిపై అనుమానాలు
నీరజ మృతిపై తండ్రితో పాటు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రాత్రి వరకు బాగానే ఉన్న తన కుమార్తె తెల్లారేసరికే విగతజీవిగా మారిపోవడానికి బలమైన కారణాలు ఏమీ లేవని వాపోయారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని పోస్టుమార్టం నివేదికలో నిజాలు వెలుగుచూస్తాయని, అప్పటి వరకు శాంతియుతంగా ఉండాలని నచ్చజెప్పారు. మృతురాలి తండ్రి కొండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంజిత్‌ తెలిపారు.

రఘునాథపాలెంలో విషాదఛాయలు ..  
ఇంటర్‌ విద్యార్థిని నీరజన అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో రఘునాథపాలెంలో  విషాదఛా యలు అలుముకున్నాయి. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఇద్దరు చిన్నారులు దారుణంగా మృతిచెందిన ఘటన మరువక ముందే మరో వి ద్యార్థిని మృతిచెందటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.ఆరుమాసాల క్రితం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతున్న పెదవీడుకు చెందిన విద్యార్థిని హాస్ట ల్‌ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top